Adivi Sesh: రాజమౌళిగారిని ఇబ్బంది పెడుతూనే ఉంటాను: నాని

  • నాని సొంత బ్యానర్ లో రూపొందిన 'హిట్ 2'
  • కొంతసేపటి క్రితం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్
  •  'హిట్ 7' వరకూ ఈ సిరీస్ వెళుతుందని వ్యాఖ్య 
  • 'హిట్ 3'లో హీరో ఎవరన్నది 'హిట్ 2'లో తెలుస్తుందని వెల్లడి
HIT 2 Pre Release Event

గతంలో విష్వక్సేన్ హీరోగా 'హిట్' సినిమాను నిర్మించిన నాని, ఈ సారి అడివి శేష్ హీరోగా 'హిట్ 2' సినిమాను నిర్మించాడు. డిసెంబర్ 2వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా, కొంతసేపటి క్రితం ప్రీ రిలీజ్ ఈవెంటును జరుపుకుంది. ఈ వేదికపై నాని మాట్లాడుతూ .. "ఈ ఫంక్షన్ కి వల్లి గారు .. రమా గారు వస్తే, మా అమ్మ .. పిన్నీ వచ్చినట్టుగా అనిపిస్తోంది. 

రాజమౌళిగారు ప్రపంచమంతా తిరిగేసి ఈ రోజునే దిగారు. అయినా పిలవగానే వచ్చారు. రాజమౌళిగారు నా ప్రొడక్షన్ లో వచ్చే సినిమాలకు తప్పకుండా వస్తారు. ఆయనను ఇబ్బంది పెట్టాలని ఉండదు .. కానీ ఇబ్బంది పెడుతూనే ఉంటాను. రాజమౌళిగారు ఈ మధ్య చాలా స్టైల్ గా కనిపిస్తున్నారు. ఆయన సినిమాలో హీరో ఎవర్రా అని అంతా ఎదురుచూస్తుంటారు. కానీ నేను మాత్రం ఆయన సినిమాలో ఆయన హీరోగా ఎప్పుడు చేస్తారా అని చూస్తున్నాను. 

ఈ సినిమాలో అడివి శేష్ అద్భుతంగా చేశాడు .. శైలేశ్ కొలను గొప్పగా తీశాడు. 'హిట్ 7' వరకూ తీసుకుని వెళతానని తాను చెప్పాడు. 'హిట్ 7' లో అప్పటివరకూ పోలీస్ ఆఫీసర్స్ గా చేసిన హీరోలందరూ కనిపించేలా ఆ పాత్రలను కలుపుతూ చేస్తానని అన్నాడు. 'హిట్ 3'లో హీరో ఎవరనేది  'హిట్ 2' చివరిలో తెలిసిపోతుంది. ఈ సినిమా తప్పకుండా చూడండి .. చూసిన తరువాత ఎలా ఉందన్నది చెప్పండి" అంటూ ముగించాడు.

More Telugu News