2న గుడ్ న్యూస్ చెబుతానంటున్న కియారా అద్వానీ
- ఎంతో కాలం పాటు రహస్యంగా కొనసాగించలేమన్న కియారా
- వెల్లడిస్తా.. వేచి ఉండాలంటూ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్
- పెళ్లి గురించా? లేక కొత్త సినిమా గురించా? అన్న సందేహాలు
సిర్ధార్థతో తన వివాహం గురించే కియారా ప్రకటన చేయనుందా? అన్న ఆసక్తి నెలకొంది. ‘‘ఎంతో కాలం పాటు దీన్ని రహస్యంగా కొనసాగించలేం. త్వరలోనే వెల్లడిస్తా.. వేచి ఉండండి.. డిసెంబర్ 2’’ అంటూ ఇన్ స్టా గ్రామ్ లో కియారా ఓ చిన్న సందేశాన్ని పోస్ట్ చేసింది. దీనికి జతగా నవ్వులు చిందిస్తున్న చిన్నపాటి వీడియో క్లిప్ ను జత చేసింది. అయితే, పెళ్లి గురించి కాకపోయి ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు. ఓ యాడ్ ఫిల్మ్ లేదంటే కొత్త సినిమా గురించి అయి ఉండొచ్చన్న ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ సస్పెన్స్ ను కియారానే డిసెంబర్ 2న తొలగించనుంది. (ఇన్ స్టా గ్రామ్ వీడియో కోసం)