కొత్త సీన్లతో విడుదలకు సిద్దమవుతున్న రజనీకాంత్ ‘బాబా’
- డిసెంబర్ 12లోపు సినిమా తిరిగి విడుదల
- కొత్త సీన్లకు డబ్బింగ్ చెప్పిన రజనీకాంత్
- తుది ఎడిటింగ్ పనిలో ఉన్న దర్శకుడు సురేశ్ కృష్ణ
సినిమాను తనకు ఓ సారి ప్రత్యేకంగా చూపిస్తే.. తాను సైతం స్వరాలకు కొత్త అందాలను అద్దుతానని ఏఆర్ రెహమాన్ చెప్పినట్టు తెలిసింది. డిసెంబర్ 12న రజనీకాంత్ పుట్టిన రోజు. వీలైతే అదే రోజు, లేదంటే దానికంటే ముందే బాబా సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. దర్శకుడు సురేశ్ కృష్ణ కొత్తగా సీన్లను చేర్చిన అనంతరం ఎడిటింగ్ ను పర్యవేక్షించే పనిలో ఉన్నట్టు సమాచారం. బాబా సినిమాకు స్క్రీన్ ప్లే, స్టోరీ అందించింది రజనీకాంతే. ఈ సినిమాలో నటించడంతోపాటు, నిర్మాత పాత్రను కూడా ఆయనే పోషించారు.