సాల్మన్ ఐలాండ్స్ లో భారీ భూకంపం... ఊగిపోయిన భవనాలు
- రిక్టర్ స్కేల్ పై 7.0 తీవ్రత నమోదు
- అంధకారంలో రాజధాని హోనియారా
- పసిఫిక్ మహాసముద్రంలో వరుస భూకంపాలు
- నిన్న ఇండోనేషియాను కుదిపేసిన ప్రకంపనలు
భారీస్థాయిలో ప్రకంపనలు రావడంతో సాల్మన్ దీవుల రాజధాని హోనియారాలో భవంతులు తీవ్రంగా ఊగిపోయాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తాము భయంతో ఇళ్లను వీడి బయటకు పరిగెత్తినట్టు ప్రజలు వెల్లడించారు. దాదాపు 20 సెకన్ల పాటు ప్రకంపనలు కొనసాగినట్టు తెలిపారు. భూకంపం ప్రభావంతో రాజధాని హోనియారా అంధకారంలో చిక్కుకుంది.
కాగా, భూకంపం నేపథ్యంలో సాల్మన్ ఐలాండ్స్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అయితే, ఆ తర్వాత సునామీ హెచ్చరికలను ఉపసంహరించుకుంది. అమెరికా భాగస్వామ్య సంస్థ పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ దీనిపై స్పందిస్తూ పెను ముప్పు తప్పిందని, లేకపోతే భారీ సునామీ ముంచెత్తేదని వెల్లడించింది.