ఫార్ములా వన్ రేసుకు హాజరైన రణవీర్ సింగ్... మీరెవరని అడిగిన జర్నలిస్టు

F1 journalist asks Ranveer Singh who are you
షార్ట్స్‌లో చూడండి
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ కు అబుదాబిలో జరిగిన ఫార్ములా వన్ రేసులో విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఓ జర్నలిస్టు రణవీర్ సింగ్ ను చూసి ఎవరో అనుకున్నాడు. ఇటీవల అబుదాబిలో ఫార్ములా వన్ గ్రాండ్ పిక్స్ కార్ల రేస్ జరిగింది. ఈ పోటీలకు రణవీర్ సింగ్ ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్ గా హాజరయ్యాడు. 

సాధారణంగా రణవీర్ బయట విచిత్రమైన వేషధారణతో కనిపిస్తుంటాడు. ఈ పోటీలకు కూడా తనదైన శైలిలో దుస్తులు, కళ్లకు కామిక్ అద్దాలు ధరించి వచ్చాడు. కాగా, అబుదాబి ఫార్ములా వన్ రేసు న్యూస్ కవరేజికి వచ్చిన మాజీ ఎఫ్1 డ్రైవర్, ప్రస్తుతం జర్నలిస్టుగా కొనసాగుతున్న మార్టిన్ బ్రండిల్... రణవీర్ సింగ్ ను చూసి ఓ కార్ రేసింగ్ అభిమానిగా భావించాడు.

రణవీర్ ఉత్సాహం ఉప్పొంగేలా మాట్లాడడం చూసి... మీరెవరు? అంటూ ప్రశ్నించాడు. అయితే, రణవీర్ ఇగోని పక్కనబెట్టి ఎంతో హుందాగా బదులిచ్చాడు. 'నేను బాలీవుడ్ నటుడ్ని. ముంబయి నుంచి వచ్చాను. నేను ఒక ఎంటర్టయినర్ ని' అని వివరించాడు. దాంతో శుభాకాంక్షలు చెప్పి ఆ జర్నలిస్టు అక్కడ్నించి నిష్క్రమించాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
Go Back to Shorts
Ranveer Singh
Martin Brundle
F1
Journalist
Abu Dhabi
Bollywood

More Telugu News