‘మాకు బీర్లు కావాలి’ నినాదాలతో హోరెత్తిన ఫిఫా ప్రపంచ కప్ స్టేడియం
- ఖతార్ తో తొలి మ్యాచ్ లో నినాదాలు చేసిన ఈక్వెడార్ అభిమానులు
- ప్రపంచకప్ స్టేడియాల్లో బీర్లను నిషేధించిన ఆతిథ్య దేశం, ఫిఫా
- అభిమానుల నుంచి తీవ్ర నిరసన
ఈ మ్యాచ్ జరుగుతుండగా ఈక్వెడార్ ఆటగాళ్లు గోల గోల చేశారు. ‘క్వెరెమోస్ సెర్వేజా, క్వెరెమోస్ సెర్వేజా’ అంటూ స్పానిష్ భాషలో అరిచారు. ‘మాకు బీర్లు కావాలి’ అనేది దీని అర్థం. అరబ్ దేశమైన ఖతార్లో కఠినమైన నియమాలు ఉంటాయి. బహిరంగ మద్యపానంపై ఆ దేశంలో ఎప్పటి నుంచో నిషేధం ఉంది. ఫిఫా ప్రపంచ కప్ సందర్భంగా స్టేడియాల్లో బీర్లు సహా మద్యం అమ్మడాన్ని, సేవించడాన్ని ఖతార్ తో పాటు ప్రపంచ ఫుట్ బాల్ సమాఖ్య నిషేధించింది. దీనిపై సాకర్ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఈ క్రమంలోన ఈక్వెడార్ ప్రేక్షకులు బీర్లు కావాలంటూ తొలి మ్యాచ్ లో నిరసన వ్యక్తం చేశారు.