ట్విట్టర్ కు షాక్ ఇచ్చిన ఉద్యోగులు... 1,200 మంది రాజీనామా!
- ట్విట్టర్ లో కొనసాగుతున్న ఊహించని పరిణామాలు
- ఇప్పటికే సగానికి పైగా ఉద్యోగులను సాగనంపిన మస్క్
- మస్క్ చర్యలను వ్యతిరేకిస్తూ 1,200 మంది ఉద్యోగుల రాజీనామా
మరోవైపు రోజుకు 12 గంటల చొప్పున వారానికి 80 గంటలు పని చేయాలంటూ మస్క్ స్పష్టం చేయడం... ట్విట్టర్ ఉద్యోగుల్లో అసహనాన్ని మరింత పెంచింది. మస్క్ చర్యను వ్యతిరేకిస్తూ ఏకంగా 1,200 మంది ఉద్యోగులు ట్విట్టర్ కు రాజీనామా చేశారు. వీరిలో ఎక్కువ మంది టెక్ విభాగానికి చెందిన వారేనని తెలుస్తోంది. దీంతో మస్క్ దిద్దుబాటు చర్యలకు దిగారు. రాజీనామా చేసిన ఉద్యోగులకు అత్యవసర ఈమెయిల్స్ పంపారు. వెంటనే శాన్ ఫ్రాన్సిస్కోలోని ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని కోరారు.