మెగాస్టార్ చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు

20-11-2022 Sun 20:01
  • నేటి నుంచి ఇఫీ చలనచిత్రోత్సవం
  • చిరంజీవిని వరించిన ప్రతిష్ఠాత్మక పురస్కారం
  • 4 దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానానికి గుర్తింపు
Indian Film Personality Of The Year award goes to Megastar Chiranjeevi
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కీర్తికిరీటంలో మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం చేరింది. చిరంజీవిని ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్-2022 అవార్డు వరించింది. 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) చలనచిత్రోత్సవం నేడు ప్రారంభమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. 

దాదాపు 40 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో చిరంజీవి 150కి పైగా చిత్రాల్లో నటించారని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సోషల్ మీడియాలో వెల్లడించింది. గోవా వేదికగా ఇఫీ చలనచిత్రోత్సవం నేటి (నవంబరు 20) నుంచి ఈ నెల 28 వరకు జరగనుంది.