11 మంది అధికార ప్రతినిధులకు తెలంగాణ పీసీసీ షోకాజ్ నోటీసులు
- నిన్న తెలంగాణ కాంగ్రెస్ సమావేశం
- జూమ్ యాప్ ద్వారా మీటింగ్
- పెద్ద సంఖ్యలో డుమ్మా కొట్టిన అధికార ప్రతినిధులు
- వివరణ కోరిన తెలంగాణ కాంగ్రెస్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిన్న జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసింది. మునుగోడు ఓటమి అనంతరం ఏర్పాటు చేసిన సమావేశం కావడంతో, ఆ ఉప ఎన్నిక ఫలితంపై సమీక్ష ఉంటుందని భావించారు. కానీ పెద్ద సంఖ్యలో అధికార ప్రతినిధులు ఈ జూమ్ మీటింగ్ కు డుమ్మా కొట్టారు.
జగ్గారెడ్డి వంటి సీనియర్ నేతలు ఇలా జూమ్ ద్వారా సమావేశం ఏర్పాటు చేయడం ఏంటని బాహాటంగానే ప్రశ్నించారు. జగ్గారెడ్డి కూడా ఈ జూమ్ సమావేశానికి గైర్హాజరైనట్టు తెలుస్తోంది. ఇదేమైనా కంపెనీనా.... ఇళ్లలో కూర్చుని చర్చించుకోవడానికి అంటూ జగ్గారెడ్డి నిలదీశారు.