cat: పిల్లికి హెయిర్ కటింగ్... వీడియో చూసి నెటిజన్ల ఫిదా

  • సెలూన్ లో పిల్లికి కటింగ్ చేసిన హెయిర్ డ్రెస్సర్
  • తల, మీసాలు కట్ చేసిన వైనం
  • ఎటూ కదలకుండా కటింగ్ చేయించుకున్న పిల్లి
Hairdresser gives cat a trim Video has over 2 million views

  ఓ హెయిర్ డ్రెస్సర్ తెల్లగా ముద్దుగా ఉన్న పిల్లి తలకు కటింగ్ చేశాడు. దాని మీసాలు కూడా కత్తిరించాడు. ఆ పిల్లి కూడా సాధారణ కస్టమర్ మాదిరిగానే ఓపిగ్గా కూర్చుంది. దువ్వెన పెట్టి కటింగ్ చేస్తుండగా.. హాయిగా కునుకు కూడా తీసింది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. 

ట్విట్టర్ లో షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే 20 లక్షలకు వైగా వ్యూస్ లభించాయి. పిల్లి చాలా బాగుందని, హెయిర్ కట్ తర్వాత అది మరింత క్యూట్ గా మారిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోను తాను పదే పదే చూస్తున్నానని ఓ వ్యక్తి పేర్కొన్నాడు. హెయిర్ సెలూన్ లో తన కంటే ఈ పిల్లే బాగా కూర్చుందని మరో వ్యక్తి కామెంట్ చేశాడు.

More Telugu News