13 కిలోల బరువు తగ్గిన మస్క్.. సీక్రెట్ ఇదేనంటూ ట్వీట్
- మరోసారి వార్తల్లో నిలిచిన ట్విట్టర్ బాస్
- స్నేహితుడి సలహాతో బరువు తగ్గినట్లు వెల్లడి
- ఇప్పుడు మరింత చురుకుగా ఉన్నానంటూ ట్వీట్
- అభినందనలు చెబుతున్న ట్విట్టర్ యూజర్లు
ఓ స్నేహితుడి సలహాతో బరువు తగ్గించుకునే ప్రయత్నం చేశానని.. ఇందుకోసం ఆహారాన్ని మితంగా తీసుకోవడంతో పాటు తనకు చాలా ఇష్టమైన ఆహార పదార్థాల జోలికి వెళ్లలేదని మస్క్ చెప్పుకొచ్చారు. వీటితో పాటు మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకునేందుకు క్రమం తప్పకుండా మందులు తీసుకున్నానని ఎలాన్ మస్క్ చెప్పారు. ఇవన్నీ క్రమపద్ధతిలో పాటించడం ద్వారా బరువు తగ్గానని వివరించారు. బరువు తగ్గాక మరింత చురుకుగా, మరింత ఆరోగ్యంగా ఉంటున్నానని మస్క్ ట్వీట్ చేశారు. కాగా, మస్క్ బరువు తగ్గడంపై ట్విట్టర్ యూజర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.