కన్నడ స్టార్ కు గోల్డ్ చైన్ బహూకరించిన రజనీకాంత్

Rajinikanth gifts gold chain to Rishabh Shetty
  • పాన్ ఇండియా స్థాయిలో ఘన విజయం సాధించిన 'కాంతార'
  • చెన్నైలో తన ఇంటికి రిషభ్ శెట్టిని ఆహ్వానించిన రజనీకాంత్
  • అద్భుతమైన చిత్రాన్ని తీశావంటూ ప్రశంస
కన్నడ సినిమా 'కాంతార' పాన్ ఇండియా లెవల్లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో రిషభ్ శెట్టి పేరు దేశ వ్యాప్తంగా మారుమోగుతోంది. ఈ సినిమాలో ఆయన ప్రధాన పాత్రను పోషించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు. ఈ సినిమాకు ఆయనే రచయిత కావడం గమనార్హం. 

ఇప్పటికే రిషభ్ శెట్టిని ప్రభాస్, కంగనా రనౌత్ తదితరులు ప్రశంసించారు. ఇప్పుడు రిషభ్ కు అంతకు మించిన సంతోషం కలిగింది. సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయనకు గోల్డ్ చెయిన్, గోల్డ్ లాకెట్ గిఫ్ట్ గా ఇచ్చారు. చెన్నైలోని తన నివాసానికి రిషభ్ ను రజీనీకాంత్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా అద్భుతమైన చిత్రాన్ని తీశావంటూ రిషభ్ ను ఆయన ప్రశంసించారు. రిషభ్ కు ఎప్పటికీ గుర్తుండిపోయేలా బహుమతిని అందించారు.
Go Back to Shorts
Rajinikanth
Rishabh Shetty
Gift
Kantara

More Telugu News