Twitter: బ్లూ టిక్ ను మళ్లీ తీసుకొస్తున్న ట్విట్టర్.. ఈ నెల 29 అందుబాటులోకి వస్తుందని మస్క్ ప్రకటన

  • చార్జీల పెంపుతో పెరిగిన నకిలీ ఖాతాల బెడద
  • తాత్కాలికంగా బ్లూ టిక్ చందా ప్లాన్ ను ఆపేసిన యాజమాన్యం
  • మార్పులు చేర్పులతో ఈ నెలాఖరున రీలాంచ్
Elon Musk To Relaunch Twitter Blue Tick Subscriptio

తన యూజర్ల కోసం బ్లూ టిక్ ప్లాన్ ను మళ్లీ తీసుకొస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటించింది. ఈ నెల 29న బ్లూ టిక్ చందాను అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించింది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేశాక బ్లూ టిక్ చార్జీల పెంపు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. అయినప్పటికీ చార్జీల విషయంలో మస్క్ వెనక్కి తగ్గలేదు. నిర్ధారిత ఖాతాలకు ఇచ్చే బ్లూ టిక్ బ్యాడ్జి కోసం నెల నెలా 8 డాలర్లు చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పాడు. అలా చెల్లించలేమని అనుకునే వాళ్లు నిరభ్యంతరంగా బ్లూ టిక్ ను వదులుకోవచ్చని ప్రకటించాడు.

చార్జీల పెంపు తర్వాత బ్లూ టిక్ విషయంలో ట్విట్టర్ కు ప్రమాదం మరో రూపంలో ఎదురైంది. సెలబ్రెటీల పేర్లతో ఖాతాలు తెరిచే వాళ్ల సంఖ్య పెరిగిపోయింది. బ్లూ టిక్ చందాకు దరఖాస్తు చేసుకుని సెలబ్రెటీల పేరుతో ఖాతాలు తెరవడం మొదలైంది. ఊహించని ఈ సమస్యతో ట్విట్టర్ యాజమాన్యం బ్లూ టిక్ సేవలను తాత్కాలికంగా నిలిపేసింది. నకిలీల బెడదను తట్టుకునేలా మార్పులు చేర్పులు చేసి తిరిగి ఈ నెల 29 న బ్లూ టిక్ ను రీలాంచ్ చేయనున్నట్లు ఎలాన్ మస్క్ మంగళవారం ప్రకటించారు.

More Telugu News