Britain: బాలిలో మోదీ-రిషి సునాక్ భేటీ.. కాసేపటికే భారత్‌కు తియ్యటి కబురు చెప్పిన బ్రిటన్

After Meet With PM Modi Rishi Sunak Okays 3000 UK Visas For Indians
  • జీ20 సదస్సులో కలుసుకున్న మోదీ, రిషి సునాక్
  • ఆ తర్వాత కాసేపటికే వీసాలపై ప్రకటన చేసిన బ్రిటన్ ప్రభుత్వం
  • భారత యువ ప్రొఫెషనల్స్‌కు ప్రతి ఏడాది 3 వేల వీసాల ప్రకటన
ఇండోనేషియా రాజధాని బాలి వేదికగా జరుగుతున్న జీ20 సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కలుసుకున్న కాసేపటికే బ్రిటన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. భారత్‌లోని యువ నిపుణులకు ప్రతి ఏడాది 3,000 వీసాలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. గతేడాది అంగీకరించిన యూకే-ఇండియా మైగ్రేషన్ అండ్ మొబిలిటీ భాగస్వామ్యంలో భాగంగా, ఈ పథకం నుంచి ఇలాంటి లబ్ధి పొందిన మొదటి దేశం భారతేనని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. యూకే-ఇండియా యంగ్ ప్రొఫెషనల్ పథకం కింద 18-30 ఏళ్ల డిగ్రీ పూర్తి చేసిన భారత పౌరులు యూకే వచ్చి రెండేళ్లపాటు ఉండేందుకు 3 వేల వీసాలను అందిస్తున్నట్టు యూకే ప్రధాని కార్యాలయం ఓ ట్వీట్‌లో పేర్కొంది. 

బ్రిటన్ ప్రధాని సునాక్, భారత ప్రధాని మోదీ జీ20 సమ్మిట్‌లో కలుసుకున్న కాసేపటికే బ్రిటన్ ప్రభుత్వం ఈ ప్రకటన చేయడం గమనార్హం. బ్రిటన్ పగ్గాలు చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తిగా రికార్డులకెక్కిన సునాక్.. మోదీని కలవడం ఇదే తొలిసారి. జీ20 సమ్మిట్‌లో యూకే, భారత ప్రధానులు కలుసుకుని మాట్లాడినట్టు మోదీ కార్యాలయం ట్వీట్ చేసింది.
Britain
UK
Rishi Sunak
Narendra Modi
Visa

More Telugu News