8 మంది వైద్య నిపుణులతో కృష్ణకు చికిత్స..., వెంటిలేటర్ పైనే సూపర్ స్టార్
- గుండెపోటుతోనే కృష్ణ ఆసుపత్రికి వచ్చారన్న కాంటినెంటల్ హాస్పిటల్
- కార్డియక్ అరెస్టుతో మూత్ర పిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు, మెదడు పనితీరు దెబ్బ తిన్నదని వెల్లడి
- 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమని వైద్యుల ప్రకటన
ప్రస్తుతం కృష్ణకు 8 మంది వైద్య నిపుణులతో చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కార్డియాక్ అరెస్టుతో కృష్ణ శరీరంలోని పలు అవయవాల పనితీరుపై తీవ్ర ప్రభావం పడిందని ఆసుపత్రి తెలిపింది. కార్డియక్ అరెస్టు కారణంగా కృష్ణ శరీరంలోని మూత్ర పిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు, మెదడు పనితీరు దెబ్బతిన్నదని వెల్లడించింది. ఇంకో 24 గంటలు గడిస్తే గానీ కృష్ణ ఆరోగ్య పరిస్థితి ఏమిటన్నది చెప్పలేమని కూడా వెల్లడించింది. ప్రస్తుతం వెంటిలేటర్ పైనే కృష్ణకు చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.