బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ అనంతబాబు... విచారణ వచ్చే నెల 12కు వాయిదా
- డ్రైవర్ హత్య కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ అనంతబాబు
- బెయిల్ పిటిషన్లను కొట్టేసిన రాజమహేంద్రవరం కోర్టు, ఏపీ హైకోర్టు
- అనంతబాబు బెయిల్ పిటిషన్ పై వచ్చే నెల 12న సుప్రీంకోర్టులో తదుపరి విచారణ
- తమ వాదనలూ పరిగణనలోకి తీసుకోవాలన్న సుబ్రహ్మణ్యం తండ్రి
అనంతబాబు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. అనంతబాబు బెయిల్ పిటిషన్ పై విచారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే అదే సమయంలో ఈ పిటిషన్ విచారణలో భాగంగా తమ వాదనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ డ్రైవర్ సుబ్రహ్మణ్యం తండ్రి కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు... రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసింది.