Greg Barclay: ఐసీసీ చైర్మన్ గా మరోసారి గ్రెగ్ బార్ క్లే

Greg Barclay elected as ICC chairman for the consecutive second term
షార్ట్స్‌లో చూడండి
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ గా న్యూజిలాండ్ కు చెందిన గ్రెగ్ బార్ క్లే మరోసారి నియమితులయ్యారు. ఆయన ఈ పదవిని చేపట్టడం వరుసగా రెండోసారి. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో నేడు ఐసీసీ సమావేశం జరిగింది. ఐసీసీ చైర్మన్ ఎన్నిక నుంచి జింబాబ్వే క్రికెట్ బోర్డు చైర్మన్ డాక్టర్ తవెంగ్వా ముఖులాని తప్పుకోవడంతో గ్రెగ్ బార్ క్లే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవిలో మరో రెండేళ్ల పాటు కొనసాగుతారు.  

ఇవాళ్టి ఐసీసీ సమావేశంలో మొత్తం 17 మంది సభ్యుల్లో డజను మందికి పైగా బార్ క్లే నాయకత్వానికి మద్దతు పలికారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తరఫున ఈ సమావేశానికి కార్యదర్శి జై షా హాజరయ్యారు. ఆయన కూడా బార్ క్లేకు మద్దతు పలికారు. 

గ్రెగ్ బార్ క్లే న్యూజిలాండ్ క్రికెట్ సంఘం మాజీ అధ్యక్షుడు. తొలిసారిగా 2020లో ఐసీసీ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం ఈ నవంబరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నిక చేపట్టారు.
Go Back to Shorts
Greg Barclay
Chairman
ICC
New Zeland
Cricket

More Telugu News