పని చేయకపోతే.. సిరిసిల్ల ప్రజలు నన్ను ఎప్పుడో పక్కన పెట్టేవారు: కేటీఆర్
- అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో జరిగిన చర్చకు హాజరైన కేటీఆర్
- వారసత్వం రాజకీయాల్లోకి ప్రవేశించడానికి మాత్రమే ఉపయోగపడుతుందని వ్యాఖ్య
- సొంతంగా నిరూపించుకోలేకపోతే ఏ వారసత్వాన్ని ప్రజలు భరించరన్న మంత్రి
- ఇందిరా గాంధీ వంటి నేతలనే ప్రజలు ఓడించారని వెల్లడి
ఈ సందర్భంగా రాజకీయ వారసత్వాన్ని ప్రస్తావించిన కేటీఆర్... వారసత్వం కేవలం రాజకీయాల్లోకి ప్రవేశాన్ని మాత్రమే ఇస్తుందన్నారు. ఆ తర్వాత సొంతంగా నిరూపించుకోలేకపోతే ఏ వారసత్వ నాయకుడిని కూడా ప్రజలు భరించరని ఆయన చెప్పారు. ఇందిరా గాంధీ వంటి నేతలనే ప్రజలు ఓడించారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా స్వయంగా తన అంశాన్నే ఇందుకు ఉదాహరణగా ఆయన చెప్పుకొచ్చారు. తన పనితీరుతోనే సిరిసిల్లలో తనకు క్రమంగా మెజారిటీ పెరుగుతూ వస్తోందని ఆయన అన్నారు. తాను సరిగ్గా పనిచేయకపోయి ఉంటే... సిరిసిల్ల ప్రజలు తనను ఎప్పుడో పక్కనపెట్టేవారని కూడా ఆయన అన్నారు.