'నేను చూసుకుంటా..' అంటూ కోమటిరెడ్డికి మోదీ హామీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'నేను చూసుకుంటా..' అంటూ కోమటిరెడ్డికి మోదీ హామీ

Modi gives assurance to Komatireddy Raj Gopal Reddy
  • బేగంపేట ఎయిర్ పోర్టులో బీజేపీ నేతలతో మాట్లాడిన మోదీ
  • రాజగోపాల్ రెడ్డితో రెండు నిమిషాలు మాట్లాడిన ప్రధాని
  • మునుగోడులో బాగా కష్టపడ్డారని ప్రశంస
బేగంపేటలో బీజేపీ శ్రేణుల కోసం ఏర్పాటు చేసిన సభ ముగిసిన తర్వాత... ఎయిర్ పోర్టులో బీజేపీ నేతలతో ప్రధాని మోదీ కాసేపు ముచ్చటించారు. లైన్ లో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బీజేపీ నేతలు ప్రధానికి పరిచయం చేశారు. దీంతో, రాజగోపాల్ రెడ్డి వద్ద ఆగిన మోదీ... ఆయనతో ప్రత్యేకంగా రెండు నిమిషాల సేపు ముచ్చటించారు. 

మునుగోడు ఉపఎన్నికలో బాగా కష్టపడ్డారని అభినందించారు. టీఆర్ఎస్ కు ముచ్చెమటలు పట్టించారంటూ భుజం తట్టి అభినందనలు తెలియజేశారు. నేను చూసుకుంటా అంటూ కోమటిరెడ్డికి వ్యక్తిగతంగా హామీ ఇచ్చారు. మిగిలిన నాయకులతో మాట్లాడుతూ తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి సైనిక హెలికాప్టర్ లో రామగుండంకు బయల్దేరారు.
Narendra Modi
BJP
Komatireddy Raj Gopal Reddy
Munugode

More Telugu News