రూ.999కే చక్కని ఇయర్ బడ్స్.. బౌల్ట్ ఎక్స్30 విడుదల

  • దీని ధర రూ.999
  • బౌల్ట్ ఎక్స్50 విడుదల 
  • దీని ధర రూ.1,399
  • అమెజాన్, ఫ్లిప్ కార్ట్ పై లభ్యం
Boult X30 X50 TWS earbuds with 40 hours playtime combat gaming mode launched price starts at Rs 999

స్మార్ట్ ఫోన్లలో ఓటీటీ యాప్స్, యూట్యూబ్ కంటెంట్ ను చూసే వారు పెరిగిపోతున్నారు. నచ్చిన కార్యక్రమాలు చూసుకునే వెసులుబాటు వల్ల వినియోగం పెరిగిపోతోంది. ఫోన్ లో ఆడియో, వీడియో కంటెంట్ ఎక్కువ చూసే వారికి, వైర్లతో కూడిన ఇయర్ ఫోన్స్ ఇబ్బందిగా అనిపిస్తుంటాయి. వైర్లు తరచూ అడ్డుగా వస్తుంటాయి. దీంతో టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్, బ్లూటూత్ హెడ్ సెట్ల వినియోగం పెరుగుతోంది. మంచి ఫీచర్లతో, తక్కువ బడ్జెట్ కే టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ కోసం ఎదురు చూసే వారికి.. బౌల్ట్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎక్స్30, ఎక్స్50 పేరుతో రెండు బడ్స్ ను విడుదల చేసింది. 

ఈ ఇయర్ బడ్స్ లో ప్రత్యేకంగా గేమింగ్ మోడ్ ఉంటుంది. వీటి డిజైన్ కూడా ఆకర్షణీయంగా ఉంది. 40 గంటల పాటు పనిచేసే బ్యాటరీ వీటిల్లో ఉంది. ఎన్విరాన్ మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ తో ఇవి వస్తాయి. కేవలం 10 నిమిషాల చార్జింగ్ తో 100 నిమిషాల పాటు పనిచేస్తాయి. 10 ఎంఎం డ్రైవర్లు వీటిల్లో ఉన్నాయి. 

వీటిని బౌల్ట్ ఆడియో వెబ్ సైట్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. అలాగే, ఎక్స్ 30 బడ్స్ ను అమెజాన్, ఎక్స్50 బడ్స్ ను ఫ్లిప్ కార్ట్ పోర్టల్ పై కొనుగోలు చేసుకోవచ్చు. బ్లాక్, వైట్ రంగుల్లో లభిస్తాయి. ఎక్స్ 30 ధర రూ.999 కాగా, ఎక్స్ 50 ధర రూ.1,399.

More Telugu News