Narendra Modi: బేగంపేటకు చేరుకున్న ప్రధాని మోదీ

Modi reached Hyderabad
  • విశాఖ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ప్రధాని
  • స్వాగతం పలికిన గవర్నర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు
  • ఎయిర్ పోర్ట్ వద్ద ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తున్న మోదీ
భారత ప్రధాని మోదీ హైదరాబాదులోని బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన హైదరాబాద్ కు వచ్చారు. ఎయిర్ పోర్టులో ఆయనకు గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, ఎమ్మెల్యే రఘునందన్, బీజేపీ నేతలు రాజగోపాల్ రెడ్డి, పొంగులేటి, డీకే అరుణ తదితరులు స్వాగతం పలికారు. 

అనంతరం బేగంపేట ఎయిర్ పోర్ట్ బయట ఏర్పాటు చేసిన సభ వేదికపైకి ప్రధాని చేరుకున్నారు. ప్రస్తుతం బీజేపీ శ్రేణులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తున్నారు.
Narendra Modi
BJP
Hyderabad

More Telugu News