సూర్యుడి కంటే వందల రెట్లు పెద్దదైన నక్షత్రంలో భారీ విస్ఫోటనం... గుర్తించిన హబుల్ టెలిస్కోప్
- అంతరిక్షంలో పరిభ్రమిస్తున్న హబుల్ టెలిస్కోప్
- పేలిపోయిన నక్షత్రం సూర్యుడి కంటే 530 రెట్లు పెద్దది
- మృతనక్షత్రంగా మారిన వైనం
- రికార్డు చేసిన హబుల్ టెలిస్కోప్
ఈ నక్షత్రం సూర్యుడి కంటే 530 రెట్లు పెద్దది. ఇది విస్ఫోటనం (సూపర్ నోవా) చెందుతూ, దానిలోని వాయువులను విశ్వంలోకి వ్యాపింపజేస్తూ మృత నక్షత్రంగా మారిపోయింది. ఈ సూపర్ నోవా 11 వందల కోట్ల సంవత్సరాల నాటి పేలుడు అని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
ఆ నక్షత్రం బాహ్యవాతావరణ పొరలు అన్నీ గ్యాస్ మయం అని, ఈ పొరలు భగ్గుమని మండిపోయి విశ్వాంతరాళాల్లోకి వ్యాపించినట్టు హబుల్ టెలిస్కోప్ రికార్డు చేసిన డేటా చెబుతోంది.
హబుల్ టెలిస్కోప్ ఈ సూపర్ నోవాను ఎనిమిది రోజుల వ్యవధిలో మూడు చిత్రాలుగా రికార్డు చేసింది. దీనికి సంబంధించిన అధ్యయనం తాజాగా జర్నల్ నేచుర్ అనే పత్రికలో ప్రచురితమైంది.