మంత్రి సబితకు గవర్నర్ తమిళిసై అపాయింట్ మెంట్
- సాయంత్రం 5 గంటలకు అపాయింట్ మెంట్
- యూనివర్శిటీల్లో ఉమ్మడి నియామక బోర్డు విషయంలో సందేహాలున్నాయన్న గవర్నర్
- వచ్చి వివరణ ఇవ్వాలంటూ ఆదేశం
దీంతో, గవర్నర్ ను కలిసేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు అపాయింట్ మెంట్ కోరారు. ఈ నేపథ్యంలో వారికి గవర్నర్ అపాయింట్ మెంట్ లభించింది. మరోవైపు, శాసనసభ ఆమోదించిన పలు బిల్లులను గవర్నర్ తొక్కిపెడుతున్నారంటూ పలువురు నేతలు విమర్శలు గుప్పించారు. ఫైల్స్ ను ఎక్కువ కాలం తొక్కిపెట్టడం మంచిది కాదని సీపీఐ నారాయణ కూడా అన్నారు.