T20 World Cup: ఇంగ్లండ్​ తో సెమీఫైనల్​.. టాస్​ ఓడి మొదట బ్యాటింగ్​కు భారత్

England chose fielding in semifinal
షార్ట్స్‌లో చూడండి
టీ20 ప్రపంచ కప్ లో ఇంగ్లండ్ తో సెమీఫైనల్లో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ కోల్పోయాడు. టాస్ నెగ్గిన ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో, భారత్ మొదట బ్యాటింగ్ కు రానుంది. ఇక ఈ మ్యాచ్ లో భారత్ తన తుది జట్టులో ఎలాంటి మార్పు చేయలేదు. సూపర్12లో చివరి మ్యాచ్ లో జింబాబ్వేపై ఆడిన జట్టునే సెమీస్ లోనూ కొనసాగించింది. మరోవైపు ఇంగ్లండ్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. గాయ పడ్డ బ్యాటర్ డేవిడ్ మలన్ స్థానంలో ఫిల్ సాల్ట్ ను తీసుకుంది. పేసర్ మార్క్ వుడ్ స్థానంలో క్రిస్ జోర్డాన్ కు తుది జట్టులో చోటు ఇచ్చింది. 

భారత తుది జట్టు: కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ (కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అర్ష్ దీప్ సింగ్. 
ఇంగ్లండ్ తుది జట్టు: జోస్ బట్లర్ (కీపర్, కెప్టెన్), అలెక్స్ హేల్స్, ఫిలిప్ సాల్ట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, సామ్ కరన్, క్రిస్ జోర్డాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్.
Go Back to Shorts
T20 World Cup
India
england
toss

More Telugu News