బిగ్ బాస్ హౌస్ లో ఇనయా .. ఫైమా మధ్య బిగ్ ఫైట్!
- 65వ రోజులోకి అడుగుపెట్టిన 'బిగ్ బాస్ బాస్'
- పోటీదారుల మధ్య జరిగిన 'పాము - నిచ్చెన' గేమ్
- బంకమట్టి కోసం కుస్తీలు పట్టిన పోటీదారులు
- ఫైమా - ఇనయా మధ్య మరింత పెరిగిన దూరం
లాన్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పాము బోర్డులపై .. నిచ్చెన బోర్డులపై అదే ఆకారంలో బంకమట్టిని పేర్చవలసి ఉంటుంది. అందుకు అవసరమైన బంక మట్టిని పోటీపడుతూ సంపాదించుకోవాలి. బంకమట్టి కోసం 'పాము' టీమ్ సభ్యులు నిచ్చెనవారిపై .. 'నిచ్చెన' టీమ్ వారు పాము టీమ్ పై దాడి చేసి బలవంతంగా లాక్కోవచ్చు. ఎవరికి సంబంధించిన బోర్డుపై తక్కువ మట్టి ఉంటే వారు ఆట నుంచి తప్పుకోవలసి ఉంటుంది. పాము 'బుస' సౌండ్ రాగానే వారు నిచ్చెన టీమ్ పై ఎటాక్ చేయాలి. 'డైస్' సౌండ్ వచ్చినప్పుడు నిచ్చెనవారు పాము టీమ్ పై ఎటాక్ చేయాలి.
ఇది పూర్తిగా ఫిజికల్ గేమ్ కావడంతో ఒక రేంజ్ లో జరిగింది. బంకమట్టిని సంపాదించుకునే విషయంలో బలవంతుడనని రేవంత్ నిరూపించుకున్నాడు. ఈ గేమ్ లో ఫైమా - ఇనయా ఇద్దరూ కూడా కుస్తీ పోటీల్లో మాదిరిగా వ్యవహరించారు. ఒక రౌండ్ లో ఇనయాను పైకి లేవనీయకుండా ఫైమా పోరాడితే, మరో రౌండులో ఫైమా పైకి లేవకుండా ఆమెపై ఇనయా కూర్చుంది. మిగతావారిని పట్టించుకోకుండా ఒకరిని ఒకరు టార్గెట్ చేయడం స్పష్టంగా కనిపించింది. గేమ్ చివరిలోను ఇద్దరూ మాటా మాట అనుకున్నారు. ఇనయా ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉండటంతో ఈ ఎపిసోడ్ ముగిసింది.
.