పదో రౌండ్ లో 'కారు'కు స్వల్ప ఆధిక్యం
- కొనసాగుతున్న మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్
- పదో రౌండ్ లో టీఆర్ఎస్ కు 484 ఓట్ల ఆధిక్యం
- 4,407 ఓట్లకు పెరిగిన లీడ్
- ముందంజలో టీఆర్ఎస్ పార్టీ
మొత్తం 10 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ పార్టీ లీడ్ 4,407 ఓట్లకు చేరింది. ఇప్పటివరకు టీఆర్ఎస్ కు మొత్తం 67,330 ఓట్లు, బీజేపీకి 62,923 ఓట్లు, కాంగ్రెస్ కు 14,596 ఓట్లు లభించాయి. మరో ఐదు రౌండ్ల కౌంటింగ్ మిగిలున్న నేపథ్యంలో మరికాసేట్లో మునుగోడు ఉప ఎన్నిక ఫలితం వెలువడనుంది.