Road Accident: ఆదిలాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం

Four Dead in a Road Accident in Adilabad District
షార్ట్స్‌లో చూడండి
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో గత రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న కారు సీతాగొంది వద్ద కంటెయినర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు పురుషులు, ఓ మహిళ ఉన్నారు.

ప్రమాదంలో మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన మహిళను రిమ్స్‌కు తరలించారు. మృతులను ఆదిలాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Go Back to Shorts
Road Accident
Adilabad
Hyderabad

More Telugu News