బిగ్ బాస్ హౌస్ లో 55వ రోజు .. గీతూకి క్లాస్ పీకిన నాగ్!

Bigg Boss 6  Update
  • 55వ రోజున బిగ్ బాస్ లో ఆసక్తికర పరిణామాలు
  • గీతూ ధోరణి పట్ల నాగ్ అసహనం 
  • ఫైమా తొందరపాటు పట్ల అసంతృప్తి 
  • ఈ వారం ఎలిమినేట్ అయిన సూర్య 
  • హౌస్ లోని వాళ్లందరిలో ఆశ్చర్యం   
బిగ్ బాస్ హౌస్ లో పోటీదారులంతా జంటలుగా విడిపోయి చేపల టాస్క్ ఆటలో పాల్గొన్నారు. ఆదిరెడ్డి - గీతూ జంటగా ఈ టాస్క్ లో పాల్గొన్నారు. అయితే ఈ టాస్కులో ఈ జంట తక్కువ చేపలను మాత్రమే దక్కించుకున్న కారణంగా పోటీలో నుంచి తప్పుకోవలసి వచ్చింది. దాంతో మిగతా ఆటగాళ్లకి సంచాలక్ గా వ్యవహరించే బాధ్యతను గీతూకి బిగ్ బాస్ అప్పగించాడు. అప్పటి నుంచి గీతూ అక్కడి ఆటను తన ఇష్టానుసారం నడిపిస్తూ పోటీదారుల అసహనానికి గురైంది. 

శనివారం రోజున నాగార్జున ఇదే విషయంపై గీతూను నిలదీశారు. బిగ్ బాస్ అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహించకుండా, తనకి తోచిన విధంగా ఆటను మార్చేయడం పట్ల ఆయన కోపాన్ని ప్రదర్శించారు. సంచాలక్ గా తన బాధ్యతను పక్కన పెట్టేసి ఆడటమేమిటని ప్రశ్నించారు. ఎవరెన్ని విధాలుగా నచ్చజెప్పడానికి ట్రై చేసినా పట్టించుకోకుండా ఆమె వ్యవహరించిన తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. 

గెలవడానికి ఆడాలనీ .. ఎదుటివారి బలహీనతలను కిందికి లాగడం వలన గెలవాడానికి ట్రై చేయడం కరెక్ట్ కాదని గీతూతో అన్నారు. ఆమె ధోరణి చూస్తుంటే 'పీత'ల తీరు గుర్తుకు వస్తుందంటూ క్లాస్ పీకారు. ఇక మెరీనా నుంచి తీసిన 'అనర్హులు' బ్యాడ్జిని శ్రీహాన్ నేరుగా కీర్తికి ఇవ్వడం .. మాట్లాడేముందు ఆలోచించుకుని మాట్లాడమని ఫైమాను నాగ్ సున్నితంగా మందలించడం ఈ ఎపిసోడ్ హైలైట్స్ గా నిలిచాయి. అయితే సూర్య కంటే వీక్ గా హౌస్ లో ఇద్దరు ముగ్గురు పోటీదారులు ఉన్నప్పటికీ, సూర్య ఎలిమినేట్ అయినట్టుగా నాగార్జున ప్రకటించడంతో హౌస్ లోని వాళ్లంతా షాక్ అయ్యారు. నిజంగానే సూర్యను ఎలిమినేట్ చేశారా? లేదంటే సీక్రెట్ రూమ్ కి పంపించే ఆలోచన ఏమైనా ఉందా? అనేది ఈ రోజు తేలనుంది..
Go Back to Shorts
Geethu
Adi Redddy
Bigg Boss 6

More Telugu News