ట్విట్టర్ ను అమ్మేసి.. కొత్త అప్లికేషన్ పై దృష్టి పెట్టిన జాక్ డోర్సే?
- బ్లూ స్కై అప్లికేషన్ ను అభివృద్ధి చేసిన జాక్ డోర్సే టీమ్
- త్వరలోనే బీటా టెస్టింగ్
- సమస్యలను సరిచేసిన తర్వాత ప్రారంభం
‘‘ప్రొటోకాల్ టెస్టింగ్ ను త్వరలోనే ప్రారంభించనున్నాం. డిస్ట్రిబ్యూటెడ్ ప్రొటోకాల్ అభివృద్ధి అనేది ఎంతో సంక్లిష్టమైన ప్రక్రియ. ఎందరో భాగస్వాముల నుంచి సమన్వయం అవసరం. ఒక్కసారి నెట్ వర్క్ ను ప్రారంభించామంటే, అప్పుడు ప్రైవేటు బీటా మొదలుపెట్టి, సమస్యలను సరిచేస్తాం’’ అని జాక్ డోర్సే నుంచి ప్రకటన వెలువడింది. నూతన సోషల్ నెట్ వర్క్ అన్నది ఒక సైట్ కాకుండా ఒకటికి మించిన వెబ్ సైట్లతో నడవనుంది.