మారుతి వేగన్ ఆర్, సెలెరియో వాహనాలు వెనక్కి
- వెనుక బ్రేకుల్లో సాంకేతిక సమస్యలు గుర్తింపు
- 9,925 యూనిట్లను వెనక్కి పిలిపిస్తున్న సంస్థ
- లోపాలున్న విడిభాగాలను ఉచితంగా మార్చి ఇవ్వనున్నట్టు ప్రకటన
వెనుక బ్రేక్ ల పిన్ లో సాంకేతిక సమస్యలను గుర్తించినట్టు మారుతీ సుజుకీ తెలిపింది. కస్టమర్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని వీటిని రీకాల్ చేస్తున్నట్టు పేర్కొంది. దెబ్బతిన్న లేదా లోపాలున్న విడిభాగాలను ఎటువంటి చార్జీ లేకుండా మార్చి తిరిగి కస్టమర్లకు వాహనాలను అందించనున్నట్టు వెల్లడించింది. ఆటోమొబైల్ తయారీ సంస్థలు వాహనాల్లో లోపాలను గుర్తించినప్పుడు ఇలా రీకాల్ చేయడం సాధారణంగా జరిగేదే.