అమెరికాలో దారుణం.. మంటల్లో తగలబడుతున్న ఇంట్లో 8 మృతదేహాలు
- ఒక్లహామాలోని బ్రోకెన్ యూరో పట్టణంలో ఘటన
- మృతుల్లో ఆరుగురు చిన్నారులు
- అనుమానాస్పద కేసుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు
చనిపోయిన చిన్నారులు 1 నుంచి 13 ఏళ్లలోపు వారేనని పేర్కొన్నారు. అగ్ని ప్రమాదం కారణంగా వీరు చనిపోయినట్టు కనిపించడం లేదని అగ్నిమాపక అధికారులు తెలిపారు. ఆ ఇంట్లో నుంచి పోలీసులు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. కాగా, స్థానిక మహిళ ఒకరు మాట్లాడుతూ.. తాను కారులో వెళ్తున్న సమయంలో ఆ ఇంటి నుంచి దట్టమైన పొగలు రావడం కనిపించిందని అన్నారు. ఆ సమయంలో స్పృహలో లేని ఓ మహిళను ఓ వ్యక్తి ఈడ్చుకెళ్లడం కనిపించిందని పేర్కొన్నారు.