తెలుగులో 25 కోట్లకి పైగా కొల్లగొట్టిన 'కాంతార'
- తెలుగులో ఈ నెల 15వ తేదీన విడుదలైన 'కాంతార'
- తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా
- 10 రోజుల్లో 27.60 కోట్ల గ్రాస్ వసూలు
- పోటీని ఇవ్వలేకపోయిన దీపావళి సినిమాలు
ఇక తెలుగు వెర్షన్ విషయానికి వస్తే, ఇక్కడ ఈ సినిమాను ఈ నెల 15వ తేదీన విడుదల చేశారు. కథాకథనాల పరంగా .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా ఈ సినిమా ఇక్కడ కూడా విజయాన్ని అందుకుంది. పది రోజుల్లో ఈ సినిమా ఇక్కడ 25 కోట్లకి పైగా వసూలు చేయడం విశేషం. 10 రోజుల్లో 15.13 కోట్ల షేర్ ను .. 27.60 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. చాలా తక్కువ సమయంలో ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం చెప్పుకోదగిన విషయమే.
దీపావళి పండుగ సందర్భంగా మూడు తెలుగు సినిమాలు .. కార్తి 'సర్దార్' రంగంలోకి దిగినప్పటికీ, 'కాంతార' వసూళ్లు తగ్గకపోవడం విశేషం. దగ్గరలో పోటీ ఇవ్వగలిగే సినిమాలు ఏమీ లేకపోవడం వలన, వసూళ్ల పరంగా ఈ సినిమా జోరు మరి కొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా సప్తమి గౌడ అలరించిన సంగతి తెలిసిందే.