రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని కావడంపై అమెరికా అధ్యక్షుడి ఊహించని స్పందన
- అద్భుతమని కొనియాడిన జో బైడెన్
- మైలురాయిగా నిలిచిపోతుందన్న అభిప్రాయం
- భారత సంతతి ప్రజల సేవలకు ప్రశంసలు
దీపావళి సందర్భంగా వైట్ హౌస్ లో అధ్యక్షుడు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చీకట్లను పారదోలి, ప్రపంచానికి వెలుగును తేగల శక్తి ప్రజలకు ఉంటుందన్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కూడా భారత సంతతికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. కమలా హ్యారిస్ ను ఎంచుకున్నది బైడెన్ అన్నది తెలిసిందే. తన ప్రభుత్వంలో ఆసియా అమెరికన్లు గతంలో ఎన్నడూ లేనంత అధికంగా ఉన్న విషయాన్ని బైడెన్ ప్రస్తావిస్తూ, ధన్యవాదాలు తెలియజేశారు.