Motorola Edge 30 Ultra: 200 మెగాపిక్సల్ కెమెరాతో మోటరోలా ఎడ్జ్ 30

Motorola Edge 30 Ultra 12GB variant arrives in India
  • 12జీబీ ర్యామ్, 256జీబీ ధర రూ.64,999
  • ఎస్ బీఐ కార్డుతో కొంటే రూ.56,999కే లభ్యం
  • 50 వాట్ వైర్ లెస్ చార్జింగ్ సపోర్ట్
మోటరోలా తన ఎడ్జ్ 30 సిరీస్ ను విస్తరించింది. మోటరోలా ఎడ్జ్ 30 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ 5జీ వేరియంట్ ను భారత వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. ఈ ఫోన్ కర్వ్ డ్ డిస్ ప్లే కలిగి ఉంది. ఎడ్జ్ 30 అల్ట్రా స్మార్ట్ ఫోన్ లో ప్రధాన ఆకర్షణ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన 200 మెగాపిక్సల్ కెమెరా అని చెప్పుకోవాలి. ఇంత పెద్ద సెన్సార్ తో వచ్చిన తొలి ఫోన్ ఇదే. మోటరోలా గతంలో ఎడ్జ్ 30 8జీబీ వేరియంట్ ఒక్కదానినే విడుదల చేయడం గమనార్హం. ఇప్పుడు ఇందులోనే హై ఎండ్ వేరియంట్ ను ప్రవేశపెట్టింది. 

దీని అసలు ధర రూ.64,999. ఎస్ బీఐ కార్డుపై ఆఫర్ ఉపయోగించుకుంటే రూ.56,999 కు సొంతం చేసుకోవచ్చు. 8జీబీ ర్యామ్ వేరియంట్ ను మోటరోలా లోగడ రూ.59,999కు విడుదల చేయడం గమనించాలి. ఫ్లిప్ కార్ట్ పై వీటిని కొనుగోలు చేసుకోవచ్చు. ఎడ్జ్ 30 అల్ట్రా 6.67 అంగుళాల కర్వడ్ పీవోఎల్ఈడీ డిస్ ప్లే, 144 హెర్జ్ రీఫ్రెష్ రేటు, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఫీచర్లు ఉన్నాయి. 4,610 ఎంఏహెచ్ బ్యాటరీ, 125 వాట్ వైర్డ్ చార్జింగ్, 50 వాట్ వైర్ లెస్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది.
Motorola Edge 30 Ultra
12GB variant
luanched
India market
smartphone

More Telugu News