Revanth Reddy: గుర్రమెక్కి ప్రచారాన్ని నిర్వహించిన రేవంత్ రెడ్డి!

Revanth Reddy rides horse during Munugodu by poll campaign
  • మునుగోడు మండలం కిష్టాపురంలో రేవంత్ రెడ్డి ప్రచారం
  • అభిమానుల కోరిక మేరకు గుర్రమెక్కిన రేవంత్ 
  • కాబోయే సీఎం అంటూ అభిమానుల నినాదాలు
మునుగోడు ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. ఈ ఉప ఎన్నికలో సత్తా చాటి... రాబోయే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం కావాలని భావిస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తమ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తరపున అలుపెరగకుండా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తాజాగా గుర్రమెక్కి ఆయన నిర్వహించిన ప్రచారం అందరినీ ఆకట్టుకుంది. మునుగోడు మండలం కిష్టాపురంలో ఆయన గుర్రంపై ఊరేగుతూ ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభిమానుల కోరిక మేరకు ఆయన గుర్రమెక్కారు. ఊరు వీధుల గుండా వెళ్తూ, ప్రజలకు అభివాదం చేస్తూ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అభిమానులు 'కాబోయే సీఎం' అంటూ నినాదాలు చేశారు.
Revanth Reddy
Congress
Munugode
Horse

More Telugu News