'కాంతార' వసూళ్లకి కళ్లెం లేనట్టే!
- క్రితం నెల 30న కన్నడలో రిలీజ్
- అక్కడ 100 కోట్ల క్లబ్ లో చేరిన సినిమా
- ఈ నెల 15వ తేదీన తెలుగు వెర్షన్ విడుదల
- 3 రోజుల్లో 16 కోట్లకి పైగా వసూళ్లు
30 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా క్రితం నెల 30వ తేదీన కన్నడలో విడుదలై 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. అక్కడ ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ ను చూసిన తరువాత, గీతా ఆర్ట్స్ వారు ఈ నెల 15వ తేదీన ఇక్కడ విడుదల చేశారు. ఈ సినిమాలో హీరో హీరోయిన్లతో సహా ఎవరూ తెలుగు ఆడియన్స్ కి పెద్దగా తెలియదు. అయినా కంటెంట్ తో ఈ సినిమా కాసుల వర్షాన్ని కురిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో మొదటి 3 రోజుల్లోనే ఈ సినిమా 16 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. ఇంకా అదే జోరును కొనసాగిస్తూ వెళుతోంది. డిఫరెంట్ జోనర్ తో కూడిన సినిమా కావడం వలన .. దగ్గరలో ఆ స్థాయి సినిమాల పోటీ లేకపోవడం వలన దీపావళికి ఈ సినిమా వసూళ్లు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.