మరో నాలుగు రోజుల్లో ప్రభాస్, మారుతి సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్!
- రిలీజ్ కి రెడీ అవుతున్న ప్రభాస్ 'ఆది పురుష్'
- షూటింగు దశలో ఉన్న 'సలార్'
- రేపటి నుంచి మారుతి సినిమా మొదలు
- హీరోయిన్స్ గా నిధి అగర్వాల్ - మాళవిక
తాజాగా ఈ సినిమాలో ప్రభాస్ లుక్ కి సంబంధించిన ఫొటో షూట్ జరిగిందని చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు ప్రభాస్ పై ఫొటో షూట్ ను నిర్వహించడానికి కూడా కారణం ఉందని అంటున్నారు. ఈ నెల 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజు. ఆ రోజున ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ పోస్టర్ ను వదలాలనే ఉద్దేశంతో ఫొటో షూట్ జరిపారని అంటున్నారు.
విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి 'రాజా డీలక్స్' అనే టైటిల్ ను ఖరారు చేయనున్నారని తెలుస్తోంది. ఒక పాత సినిమాహాలు చుట్టూ తిరిగే కథ ఇది అని అంటున్నారు. తాత - మనవడుగా ప్రభాస్ కనిపించనున్నాడని సమాచారం. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలకు అవకాశం ఉండగా, నిధి అగర్వాల్ - మాళవిక మోహనన్ ను ఆల్రెడీ ఎంపిక చేశారు. రేపటి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది.