జిమ్​ లో ఎక్విప్​ మెంట్​ కోసం మహిళల ఫైటింగ్​.. వైరల్​ వీడియో ఇదిగో
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జిమ్​ లో ఎక్విప్​ మెంట్​ కోసం మహిళల ఫైటింగ్​.. వైరల్​ వీడియో ఇదిగో

Women slap each other over gym equipment
  • షోల్డర్ లిఫ్టర్ పరికరం (స్మిత్ మెషీన్) మీద వ్యాయామం చేస్తున్న ఓ మహిళ
  • అక్కడ వేచి ఉన్న మరో మహిళ.. ఆమెను తోసేస్తూ వచ్చిన ఇంకో మహిళ
  • ఆగ్రహంతో పోట్లాట.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సీసీ కెమెరా ఫుటేజీ
రోడ్డు మీదో, షాపుల వద్దనో, మరో చోటనో గొడవలు జరుగుతుండటం చూస్తూనే ఉంటాం. ఒక్కోసారి మగవాళ్లు, ఆడవాళ్లు కూడా ఫైటింగ్ చేస్తుంటారు. అయితే జిమ్ లో పరికరం కోసం ఇద్దరు మహిళలు కొట్టుకున్న వీడియో తాజాగా వైరల్ గా మారింది. ఒకరినొకరు కొట్టుకోవడం మొదలుపెట్టిన మహిళలు మధ్యలో ఇతరులువచ్చినా ఆపకపోవడం గమనార్హం.

వేచి ఉన్న వారిని కాదని వచ్చి..
ఓ పెద్ద జిమ్ లో కొందరు మహిళలు, పురుషులు వ్యాయామాలు చేస్తున్నారు. అందులో షోల్డర్ లిఫ్టర్ పరికరం (స్మిత్ మెషీన్) వద్ద ఓ మహిళ వ్యాయామం చేస్తోంది. సదరు మహిళ ఆపగానే తాను వ్యాయామం చేద్దామని.. నలుపు రంగు టీషర్టు వేసుకున్న మరో మహిళ అక్కడే వేచి చూస్తోంది. ముందు వ్యాయామం చేస్తున్న ఆమె షోల్డర్ లిఫ్టర్ ను వదిలేసి పక్కకు జరగగానే.. మరోవైపు నుంచి ఆకుపచ్చ రంగు టీషర్ట్ వేసుకున్న మహిళ దూసుకొచ్చింది. నలుపురంగు టీషర్ట్ మహిళను తోసేస్తూ షోల్డర్ లిఫ్టర్ పరికరాన్ని తీసుకోవడానికి ప్రయత్నించింది. దాన్ని ఆమె ప్రతిఘటించడంతో ఇద్దరూ జుట్టూ జుట్టూ పట్టుకుని కొట్టుకోవడం మొదలుపెట్టారు. చుట్టూ ఉన్నవారు చూసి ఆపడానికి ప్రయత్నించినా ఆగలేదు. కాసేపటికి వదిలేశారు.

  • ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డయింది. బహర్ కె కలేష్ పేరిట ఉన్న ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్టు చేయగా.. మూడున్నర లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. వేల కొద్దీ లైకులు, కామెంట్లు నమోదవుతున్నాయి.
  • ‘‘కేలరీలు కరిగించడానికి జిమ్ కు వచ్చారు. వ్యాయామంతో కాకుంటే ఫైటింగ్ తో కేలరీలు కరిగిస్తున్నారు..” అంటూ కొందరు కామెంట్లు చేస్తుంటే.. ‘‘గ్రీన్ టీషర్టు మహిళ మరీ దురుసుగా ప్రవర్తించింది’’ అని కొందరు.. ‘‘వేచి ఉన్న మహిళ మరికాసేపు ఆగితే పోయేదిగా” అంటూ ఇంకొందరు అంటున్నారు. 
  • ‘‘అమ్మాయిలు ఎప్పుడూ అంతే.. ఎదుటివాళ్లు దొరికితే ఇట్టే జుట్టు పట్టేసుకుంటారు. అవతలి వాళ్లూ వీళ్ల జుట్టు పట్టుకుంటారు. ఇక ఫైటింగ్ సగం అక్కడే..” అంటూ కొందరు సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు.
Women
Gym
offbeat
Viral Videos
Twitter

More Telugu News