జోగులాంబ ఆలయ హుండీలో రూ.100 కోట్ల చెక్కు కలకలం.... అధికారులు ఆరా తీస్తే...!
- హుండీలో బ్యాంక్ చెక్కును గుర్తించిన ఆలయ అధికారులు
- అక్షరాలా వంద కోట్ల రూపాయలు అని రాసి ఉన్న వైనం
- మతిస్థిమితం లేని వ్యక్తి పనిగా గుర్తింపు
- అతడి ఖాతాలో రూ.23 వేలు ఉన్నట్టు వెల్లడి
- ఆ వ్యక్తిని ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలించిన పోలీసులు
ఆ చెక్కుపై 'అక్షరాలా వంద కోట్ల రూపాయలు' అని రాసి ఉంది. అయితే ఆ చెక్కు నిజమైనదేనా అని అనుమానం వచ్చిన ఆలయ అధికారులు ఆరా తీస్తే ఆసక్తికర సంగతులు వెల్లడయ్యాయి. ఆ చెక్కు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు వరంగల్ బ్రాంచికి చెందినదని తెలిసింది.
ఆ చెక్కును హుండీలో వేసిన వ్యక్తి ఆలంపూర్ మండలానికి చెందినవాడే. అయితే అతడికి మతిస్థిమితం లేదని గుర్తించారు. ఇక, వంద కోట్లు అని రాసిన ఆ వ్యక్తి బ్యాంకు అకౌంట్లో ఉన్నది కేవలం రూ.23 వేలేనట. అతడు తన చెక్కుపై 'ఆర్మీ జవాన్ల కోసం' అని రాసి ఉన్నట్టు అధికారుల పరిశీలనలో వెల్లడైంది.
కాగా, ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి రీత్యా పోలీసులు అతడిని హైదరాబాదులోని ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో చేర్పించినట్టు తెలిసింది.