Abhiram: 'అహింస' నుంచి కమ్మగుంటదే పిల్లా ఫుల్ సాంగ్ రిలీజ్!

Ahimsa movie lyrical song released
షార్ట్స్‌లో చూడండి
దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో హీరోగా అభిరామ్ వస్తున్నాడు. 'అహింస' సినిమాతో తేజ దర్శకత్వంలో తెలుగు తెరకి అభిరామ్ పరిచయమవుతున్నాడు. చాలా కాలంగా షూటింగు జరుపుకుంటూ వచ్చిన ఈ సినిమా, త్వరలో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ నేపథ్యంలో  కొంత సేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగును రిలీజ్ చేశారు.

హీరో .. హీరోయిన్ ఒకరి పట్ల ఒకరు తమ ప్రేమను వెల్లడి చేసే ప్రయత్నంగా ఈ పాట వస్తుంది. ఆర్పీ పట్నాయక్ అందించిన బాణీ కొత్తగా అనిపిస్తుంది. చంద్రబోస్ సాహిత్యంలోని సుకుమారమైన భావాల సొంపు కూడా మనసును తాకుతుంది. కాలభైరవ - కీర్తన శ్రీనివాస ఆలపించిన ఈ పాటను గ్రామీణ నేపథ్యంలోని లొకేషన్స్ లో చిత్రీకరించిన తీరు కూడా ఆకట్టుకుంటుంది. 

ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాపై అంచనాలు పెంచేదిలానే ఈ పాట ఉంది. ఈ సినిమాతో గీతిక తివారి కథానాయికగా తెలుగు తెరకి పరిచయమవుతోంది. ప్రేమకథా చిత్రాలలో ఎప్పటికప్పుడు ట్రెండ్ సెట్ చేస్తూ వచ్చిన తేజ, ఈ సినిమాతో మరో సంచలనానికి తెర లేపుతాడేమో చూడాలి.
Go Back to Shorts
Abhiram
Geethika
Rajath Bedi
Ahimsa Movie

More Telugu News