పెరిగిన అమూల్ పాల ధరలు... గుజరాత్‌లో మాత్రం ధర పెంపు లేదు
- ఫుల్ క్రీమ్ మిల్క్, గేదె పాలపై లీటరుకు రూ.2 పెంచిన అమూల్
- ఈ ఏడాదిలో అమూల్ పాల ధరల పెంపు ఇది మూడో పర్యాయం
- ధరలను పెంచిన తర్వాత ప్రకటన విడుదల చేసిన వైనం
మరోవైపు అమూల్ పాల ధరలను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పెంచుతున్నట్లు ప్రకటించిన అమూల్... తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో మాత్రం ధరలను పెంచలేదు. గుజరాత్ మినహా దేశవ్యాప్తంగా పాల ధరలను పెంచుతున్నట్లు అమూల్ ప్రకటించింది. ఫుల్ క్రీమ్ మిల్క్, గేదె పాలపై లీటరుకు రూ.2 ధరను పెంచింది. శుక్రవారం దాకా ఈ మిల్క్ ధర మార్కెట్‌లో రూ.61 ఉండగా... శనివారం నుంచి ఈ ధర రూ.63కు పెరిగింది. అంతేకాకుండా ఒకే ఏడాదిలో అమూల్ తన పాల ధరలను లీటరుకు ఏకంగా రూ.6 మేర పెంచడం గమనార్హం.