అదృష్టం ఇతనిదే.. అప్పు కట్టాలని బ్యాంకు నోటీసు.. గంటన్నరలో రూ. 70 లక్షల లాటరీ
- కేరళలో చేపలు అమ్ముకునే వ్యక్తికి జాక్ పాట్
- ఇల్లు కోసం తీసుకున్న లోను కట్టాలని 2 గంటలకు బ్యాంక్ నుంచి నోటీసు
- 3.30 కి లాటరీ సందేశం రావడంతో మారిన తలరాత
దాంతో, వెంటనే అప్పు చెల్లించలేదని బ్యాంకు అతనికి నోటీసు ఇచ్చింది. అతన్ని డిఫాల్టర్‌గా గుర్తించిన బ్యాంక్ అసలు 9 లక్షలుకు వడ్డీతో కలిపి మొత్తం రూ. 12 లక్షలు చెల్లించాలి. లేదంటే ఇంటిని జప్తు చేస్తామని నోటీసులో పేర్కొంది. ఈ నోటీసు చూసి దిగాలుగా చేపల వేటకు వెళ్తున్న సమయంలో అతనికి మరో సందేశం వచ్చింది. ఈ నెల 12వ తేదీన కొన్న లాటరీకి మొదటి బహుమతిగా రూ. 70 లక్షలు లభించినట్టు తెలిసింది. అంతే గంటన్నరలో అతని తలరాత మొత్తం మారిపోయింది. దాంతో, పూకుంజు, అతని భార్య, కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి.