వివేకా హత్య కేసును ఏపీ బయట విచారించాలని సుప్రీంలో పిటిషన్... ఏపీ సర్కారుపై ధర్మాసనం ప్రశ్నల వర్షం
- కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదన్న సుప్రీంకోర్టు
- కేసులోని తీవ్ర ఆరోపణల మేరకు వ్యవహరిస్తున్నారా? అని నిలదీత
- కేసులో ఇంప్లీడ్ చేసుకోవాలన్న వివేకా బంధువు పిటిషన్ కొట్టివేత
- వివేకా కుమార్తె తప్పించి ఇంకెవరి వాదనలు వినబోమని స్పష్టీకరణ
- పిటిషన్‌పై విచారణను ఈ నెల 19కి వాయిదా వేసిన కోర్టు
ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ తరఫు న్యాయవాదికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై తాము కూడా కౌంటర్ దాఖలు చేస్తామన్న ఏపీ ప్రభుత్వ న్యాయవాది... అందుకు ఒకటి, రెండు రోజుల గడువు కావాలని కోరారు. ఈ వ్యవహారంలో తననూ ఇంప్లీడ్ చేయాలంటూ వివేకా బంధువు ఒకరు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. అంతేకాకుండా వివేకా కుమార్తె మినహా మరెవరి వాదనలు ఈ వ్యవహారంలో వినాల్సిన అవసరం లేదని కోర్టు తేల్చి చెప్పింది. అనంతరం ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.