సొంత ఖర్చుతో భార్యతో కలిసి చంద్రుడి పర్యటనకు వెళ్లనున్న ప్రపంచ మొదటి స్పేస్ టూరిస్ట్
- ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ లో ప్రయాణానికి ఒప్పందం
- మొత్తం 10 మందితో చంద్రుడిపైకి వెళ్లేందుకు సిద్ధం
- పర్యటన ఖర్చు మొత్తం భరించేందుకు రెడీ
టిటో 2001లో స్పేస్ టూరిజంను ప్రారంభించాడు. సొంత ఖర్చులతో అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి వ్యక్తి అయ్యాడు. ఇప్పుడు చంద్రుడిని చుట్టి రావడానికి స్పేస్ ఎక్స్ తో గతేడాది ఆగస్టులో ఒప్పందం చేసుకున్నాడు. ఈ ఉమ్మడి ఒప్పందంలో భాగంగా ఐదేళ్లలోపు ఎప్పుడైనా విమాన ప్రయాణానికి అవకాశం ఉందని టిటో చెప్పాడు. టిటోకు అప్పటికి 87 ఏళ్లు వస్తాయి. ఒకవేళ తన ఆరోగ్యం క్షీణిస్తే మాత్రం ఈ యాత్రను విరమించుకోవాలని చూస్తున్నాడు. కాగా, అంతరిక్షంలోకి వెళ్లిన అతి పెద్ద వయస్కుడిగా అమెరికాకు చెందిన జాన్ గ్లెన్ రికార్డు సృష్టించాడు. 77 ఏళ్లప్పుడు జాన్ గ్లెన్ అంతరిక్షంలోకి వెళ్లాడు. దాన్ని టిటో బ్రేక్ చేసే అవకాశం ఉంది.