'రాజా డీలక్స్'లో ప్రభాస్ తో తలపడే పవర్ఫుల్ విలన్ ఎవరంటే!

Raja Deluxe Movie Update
  • ప్రభాస్ హీరోగా రూపొందనున్న 'రాజా డీలక్స్'
  • పాత సినిమా థియేటర్ చుట్టూ తిరిగే కథ 
  • దర్శకుడిగా మారుతి ప్రయోగం 
  • కథానాయికగా తెరపైకి నిధి అగర్వాల్ పేరు  
ప్రభాస్ హీరోగా మారుతి ఒక సినిమాను రూపొందించనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకి 'రాజా డీలక్స్' అనే టైటిల్ ను పరిశీలనలో ఉంచారు. దాదాపు అదే టైటిల్ ఖరారు కావొచ్చని అంటున్నారు. ఒక పాత థియేటర్ చుట్టూ తిరిగే కథ ఇది. అనుకోని సంఘటనలతో .. అనూహ్యమైన మలుపులతో ఈ కథ నడుస్తుంది.

ఈ సినిమాలో ఒక కథానాయికగా నిధి అగర్వాల్ - మరో కథానాయికగా మాళవిక నాయర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ప్రతినాయకుడి పాత్ర కోసం సంజయ్ దత్ ను సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంజయ్ దత్ ఒప్పుకుంటాడా .. లేదా అనేదే డౌటు. ఆయన డేట్స్ సర్దుబాటు అయితేనే ఈ సినిమాను చేసే ఛాన్స్ ఉంటుంది. అందువలన ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారట. 

సంజయ్ దత్ ఒప్పుకుంటే ఈ సినిమా రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోవడం ఖాయం. హీరో ప్రభాస్ అయినప్పటికీ, ఒక మాదిరి బడ్జెట్ తోనే ఈ సినిమాను నిర్మించేలా ప్లాన్ చేసుకున్నారు. బడ్జెట్ పరంగా కాకుండా .. కంటెంట్ పరంగా ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో కనెక్ట్ చేయాలనే పట్టుదలతో మారుతి ఉన్నాడు. 'పక్కా కమర్షియల్' రిజల్టుతో డీలాపడిన మారుతి ఈ సినిమాతో కోలుకుంటాడేమో చూడాలి.
Go Back to Shorts
Prabhas
Nidhi Agarwal
Maruthi

More Telugu News