ఆర్టీసీ ఇంద్ర బస్సులో ప్రయాణికులపై కారం చల్లిన వ్యక్తి

  • హైదరాబాద్ నుంచి రాజోలు వెళుతున్న బస్సు
  • పాలకొల్లు వద్ద ఘటన
  • ప్రయాణికుల ఫిర్యాదుతో వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు
Man spills mirchi powder on passengers in RTC Bus

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వద్ద ఆర్టీసీ ఇంద్ర బస్సులో ఓ వ్యక్తి దుశ్చర్యకు పాల్పడ్డాడు. బస్సులోని ప్రయాణికులపై కారం చల్లాడు. ఆ సమయంలో బస్సు హైదరాబాద్ నుంచి రాజోలు వెళుతోంది. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. 

అతడి పేరు గుడాల రాంబాబు అని, స్వస్థలం ఆచంట మండలం అయోధ్యలంక అని వెల్లడైంది. రాంబాబు దుబాయ్ వెళ్లేందుకు హైదరాబాద్ వెళ్లాడు. అయితే శంషాబాద్ విమానాశ్రయంలో అతడి పాస్ పోర్టును అధికారులు తిరస్కరించారు. ఈ కారణంగానే అతడు బస్సులో దుశ్చర్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు.

More Telugu News