కేటీఆర్‌కు ఘాటు రిప్లై ఇచ్చిన బండి సంజ‌య్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేటీఆర్‌కు ఘాటు రిప్లై ఇచ్చిన బండి సంజ‌య్‌

bandi sanjay harsh reply to ktr tweet
  • కేసీఆర్ క్షుద్ర పూజ‌లు చేస్తున్నార‌న్న బండి సంజ‌య్‌
  • సంజ‌య్ వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో ఘాటుగా స్పందించిన కేటీఆర్‌
  • కేటీఆర్ ట్వీట్‌కు మ‌రింత ఘాటు రిప్లై ఇచ్చిన బీజేపీ నేత‌
తెలంగాణ సీఎం కేసీఆర్ తాంత్రిక పూజ‌లు చేయిస్తున్నారంటూ బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ చేసిన వ్యాఖ్య‌లు రాష్ట్రంలో రాజ‌కీయాల‌ను ఒక్క‌సారిగా వేడెక్కించాయి. బండి సంజ‌య్ వ్యాఖ్య‌లపై ఘాటుగా స్పందించిన టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగతి తెలిసిందే. కేటీఆర్ వ్యాఖ్య‌ల‌పై శ‌నివారం రాత్రి బండి సంజ‌య్ మ‌రింత ఘాటుగా స్పందించారు. ఈ మేర‌కు రెండు వ‌రుస ట్వీట్ల‌ను సంజ‌య్ పోస్ట్ చేశారు.

కేటీఆర్‌ను ట్విట్ట‌ర్ టిల్లుగా అభివ‌ర్ణించిన సంజ‌య్‌.. ఆయ‌న డ్ర‌గ్స్ డోసేజీని కంట్రోల్లో పెట్టాలంటూ టీఆర్ఎస్ శ్రేణుల‌కు సూచించారు. మీ లాంటి లంగ‌లూ, లఫంగాల‌తోనే స‌మాజానికి పెను ప్ర‌మాద‌మంటూ సంజ‌య్ ఘాటు వ్యాఖ్య చేశారు. ఇంటి యజమానిని కరిచే కాపలా కుక్కలు... కంటికి అంజనం రుద్దుకొని తిరిగే క్షుద్ర మంత్రగాళ్లు... డ్రగ్స్ సేవించే బ్లాక్ మెయిల‌ర్లు.. మత్తెక్కి తైతక్కలాడే లిక్కర్ సీసాలు.. అంటూ సంజ‌య్ ఓ రేంజిలో సాగిపోయారు. కాపలా కుక్కలా ఉండమని పదవిస్తే కచరా కుక్కలు పిచ్చెక్కి కరవడానికి ఊరి మీద పడ్డాయ‌న్న సంజ‌య్‌... తన్ని తరిమేయకుంటే రాష్ట్రానికి, దేశానికే ప్రమాదమ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. పోయి వెటర్నరీ డాక్టర్ కు చూపించుకొండి అంటూ టీఆర్ఎస్ శ్రేణుల‌ను పింకీలుగా అభివ‌ర్ణిస్తూ మ‌రింత ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.
Telangana
Bandi Sanjay
BJP
TRS
KTR
KCR

More Telugu News