మార్కెట్లో అమ్మాయి డ్యాన్స్.. వెనకాల ఓ పెద్దాయన డ్యాన్స్.. వైరల్ వీడియో ఇదిగో
- ‘ఇవాళ రేపు రోడ్ల మీద కూడా మంచి తోడు దొరుకుతోంది’ అంటూ క్యాప్షన్
- ఆమె డ్యాన్స్ బాగుంది, వెనకాల వ్యక్తి డ్యాన్స్ ఇంకా బాగుంది అంటూ నెటిజన్ల స్పందన
- రెండు రోజుల్లోనే రెండున్నర లక్షలకుపైగా వ్యూస్.. వేల కొద్దీ లైకులు
ఒకరికి పోటీగా మరొకరు డ్యాన్స్ చేశారంటూ..
- చిల్డ్ యోగి పేరిట ఉన్న ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేయగా.. ఇప్పటివరకు 2.62 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. వేల సంఖ్యలో లైకులు, రీట్వీట్లు నమోదవుతున్నాయి.
- ‘అచ్చా హై ఆజ్ కల్ రోడ్ సైడ్ లోగోంకీ కంపెనీ మిల్ జాతీ హై (మంచిది ఇవాళ, రేపు రోడ్ల మీద కూడా మంచి తోడు దొరుకుతోంది)’ అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ పెట్టారు.
- ‘అమ్మాయి డ్యాన్స్ చాలా బాగుంది’ అని పలువురు నెటిజన్లు సింపుల్ గా కామెంట్ చేస్తే.. ‘ఆ వెనకాల పెద్దాయన ఈజ్ తో చేసిన డ్యాన్స్ ఇంకా బాగుంది. ఐయామ్ ఇంప్రెస్డ్’ అంటూ మరికొందరు పేర్కొంటున్నారు.
- ‘‘ఆమె డ్యాన్స్ తో పాటు వెనకాల వ్యక్తి చేసిన డ్యాన్స్ కూడా అదిరిపోయింది” అని చాలా మంది ప్రశంసిస్తున్నారు. ‘‘ఆమె డ్యాన్స్ చూస్తూ తాను అలా చేయడానికి పెద్దాయన చేసిన ప్రయత్నం మామూలుగా లేదు” అని మరికొందరు మెచ్చుకుంటున్నారు.
- ఇక ‘నడిరోడ్డులో మార్కెట్ల వద్ద అమ్మాయిలు అలా డ్యాన్స్ చేయడం ఏమిటి? ఇదేం కొత్త ట్రెండ్’ అని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.