పెళ్లి చేసుకుంటానని ఇంటి నుంచి తీసుకెళ్లి మోసం చేసిన ప్రియుడు.. సెల్ఫీ వీడియో తీసుకుని యువతి ఆత్మహత్య
- మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఘటన
- ఇంటి నుంచి తీసుకెళ్లాక తప్పించుకు తిరుగుతున్న వైనం
- పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్యాయత్నం
- మంచిర్యాల జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
మనస్తాపంతో పురుగుల మందు తాగి తన ఊరైన లంబాడితండాకు ఆటోలో బయలుదేరింది. ఈ క్రమంలో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. గమనించిన ఆటో డ్రైవర్ వెంటనే ఆమెను స్థానిక పీహెచ్‌సీ సెంటర్‌కు తరలించాడు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. తాజాగా, ఆమె సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. రాజ్‌కుమార్‌ను నమ్మి అందరినీ వదిలేసి ఇంటి నుంచి వచ్చేశానని, ఇప్పుడు అతడు తప్పించుకుని తిరుగుతున్నాడని, ఇక తనకు దిక్కెవరని సెల్ఫీ వీడియోలో కన్నీరు పెట్టుకుంది. తనకు అన్యాయం జరిగిందని వాపోయింది.