ఘోరం.. అపహరణకు గురైన భారత సిక్కు కుటుంబం హత్య
- కాలిఫోర్నియాలోని మెర్సెడ్ కంట్రీలో వెలుగు చూసిన మృతదేహాలు
- 8 నెలల పసికందునూ విడిచిపెట్టని అగంతకుడు
- నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
వ్యవసాయ కార్మికుడు వీరి మృత దేహాలను చూసి అధికారులకు సమాచారం ఇచ్చినట్టు వార్న్ కే వెల్లడించారు. గత సోమవారం ఉదయం వీరంతా అపహరణకు గురవడం తెలిసిందే. ఈ ఘటన చూసి తనకు వచ్చిన కోపాన్ని వర్ణించలేనని పోలీసు అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. జీసస్ మాన్యుయేల్ సల్గాడో అనే వ్యక్తి ఈ హత్యలకు పాల్పడినట్టు వార్న్ కే ప్రకటించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అతడు ఆత్మహత్యాయత్నం చేశాడు. సీరియస్ గా ఉండడంతో అతడ్ని హాస్పిటల్ కు తరలించారు. జస్ దీప్ సింగ్ ఇటీవలే ట్రక్ రెంటింగ్ కంపెనీని ప్రారంభించాడు. అతడి కుటుంబ సభ్యులు అందరినీ అక్కడి నుంచే నిందితుడు అపహరించుకుపోయాడు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియోు ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు.